బిగ్ బాస్ తెలుగు పైకి కిందకు లేస్తూ పడుతూ తన జర్నీతో ముందుకు సాగుతుంది. ఇక బిగ్ బాస్ కు సంబంధించి ఇప్పటి వరకు కెప్టెన్సీ గా మగవారే ఎంపిక కావడంతో ఈసారి బిగ్ బాస్ లేడీస్ కు అవకాశం ఇచ్చాడు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ వినియోగించుకొని కెప్టెన్ అయ్యే అవకాశాన్ని అందరూ వినియోగించుకున్నారు. అందులో భాగంగా బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తూ సైరన్ మోగే సమయానికి కన్ఫెషన్ రూమ్ సీటులో ఎవరైతే ముందు కూర్చుంటారో వారిలో మొదటి ఇద్దరిని సెలెక్ట్ చేయడం జరుగుతుందని చెప్పగా వితిక, శివజ్యోతి ముందుగా కన్ఫెషన్ రూమ్ లో కూర్చోగా వారిద్దరికీ బిగ్ బాస్ మరో టాస్క్ ఇచ్చాడు.

వారిద్దరిని గాలిలో వేలాడదీసి, మొదట స్విమ్మింగ్ పూల్ నీటిలో ఎవరైతే ముందు కాలు పెడతారో వారు టాస్క్ నుంచి ఎలిమినేట్ అయినట్లు అని చెప్పడంతో వితిక, శివజ్యోతి చివరి వరకు పోటీ పడి… వితిక ఎక్కువసేపు ఉండలేక తనకు నీరసం వస్తుందని తనను దింపేయమని తనకు సపోర్ట్ చేసిన ఇంటి సభ్యులకు తెలపడంతో వితిక ఓడిపోయింది. ఇక ఈ వారం ఇంటి కెప్టెన్ గా శివజ్యోతి నామినేట్ కావడం జరిగింది. ఈ వారం ఎలిమినేషన్ లో శివజ్యోతి ఉండటంతో దాదాపుగా నామినేషన్ నుంచి సేఫ్ అయిందనే చెప్పుకోవచ్చు.    

  •  
  •  
  •  
  •  
  •  
  •