గతంలో అనేక ప్రమాదకరమైన గేమ్స్ వచ్చి ఎంతో మంది యువత, చిన్నారులు వాటికి బలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ప్రమాదకరమైన గేమ్ తెరమీదకు వచ్చింది. స్కల్‌ బ్రేకర్‌ ఛాలెంజ్‌ పేరిట సోషల్ మీడియాలో ఈ గేమ్ వైరల్ గా మారింది. ఇద్దరు వ్యక్తులు గాలిలో ఎగురుతూ ఉండగా మూడవ వ్యక్తి వారి మధ్యలో నిల్చుని అలాగే చేస్తుంటాడు. మధ్యలో వ్యక్తి పైకి ఎగురుతుండగా అతడి కాళ్లపై మిగిలిన ఇద్దరు తన్నడం ఈ ఆట ప్రత్యేకత. మధ్యలో వ్యక్తి కింద పడేలా తన్నడం చూసిన చిన్నారులు, యువత ఈ ఛాలెంజ్ మత్తులో కూరుకుపోతున్నారు.

ఈ గేమ్ ప్రస్తుతం టిక్ టాక్ లో సర్క్యులేట్‌ అవుతుంది. యూత్ ఇప్పటికే ఈ గేమ్ ను ఫాలో అవుతుండడంతో వారికి గాయాలు అవుతున్నాయి. ఇక రానున్న రోజుల్లో ఈ గేమ్ ఛాలంజ్ కి ఆదరణ పెరిగితే వారి వెన్నుముక, తలకు తీవ్ర గాయలయ్యే ప్రమాదం ఉందంటున్నారు. కాబట్టి ఇలాంటి ప్రమాదకర గేమ్స్ జోలికి పోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •