కొంతమంది ఆదమరిచి నిద్రపోతారు, ఒక్కోసారి నిద్రపోతే 14 నుంచి 16 గంటల వరకు లెగవరు. కానీ ఇలా రోజు నిద్రపోవడం కూడా ప్రమాదకరమే. కానీ మీరు ఏదైనా ఒత్తిడిలో ఉన్నప్పుడు, మానసిక ఆందోళనకు గురవుతున్నప్పుడు కంటి నిండా అన్ని మర్చిపోయి నిద్రపోతే మీ సమస్య నుంచి 30 శాతం మేర బయటపడవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆందోళనకు సంబంధించిన రుగ్మతలకు ఔషధాలు అవసరంలేని పరిష్కారంగా గాఢ నిద్రను సూచించవచ్చని చెబుతున్నారు.

అసలు ఇలా ఆందోళన, మానసిక సంఘర్షణలకు సంబంధించి ఇబ్బంది పడేటప్పుడు నిద్ర ఎంతవరకు మేలు చేస్తుంది, ఎంతమేర అపాయం చేస్తుంది అన్నదాని మీద అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అధ్యయనం చేపట్టి ఈ విషయాన్ని నిర్ధారించారు. దీనికి సంబంధించి ఇలా మానసిక ఆందోళనకు గురవుతున్న కొంత మందిపై చేసిన అధ్యయనం ప్రకారం ఇలాంటి రుగ్మతల నుంచి బయటపడటానికి నిద్ర ఎంతో ఉపకరిస్తుందని తెలియచేసారు.