హిందూస్టాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్ నుండి పొగలు రావడంతో మళ్ళీ విశాఖలో కలకలం రేపింది. మల్కాపురంలోని హెచ్‌పీసీఎల్ రిఫైనరీ గొట్టాల నుండి ఒక్కసారిగా పొగలు రావడంతో మర్రిపాలెం, కంచరపాలెం వాసులు భయభ్రతులకు గురయ్యారు. మల్కాపురం పారిశ్రామికవాడలో ఉన్న హెచ్‌పీసీఎల్ రిఫైనరీ లో NHU ను తెరిచేందుకు సంస్థ సన్నాహాలు చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే నిమిషాల వ్యవధిలోనే పొగ తీవ్రత తగ్గిపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

ఇక ఈ సంఘటనపై స్పందించిన హెచ్‌పీసీఎల్ యాజమాన్యం.. రిఫైనరీ లో NHU ను తెరిచే క్రమంలో ఉష్ణోగ్రతలు పెరిగినట్లు గుర్తించాం అన్నారు. దీంతో వెంటనే పరిస్థితిని చక్కదిద్దామని.. ఇప్పుడు ఎలాంటి పోగ రావటంలేదని.. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందన్నారు.

టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలో చేరబోతున్న టీడీపీ ఎమ్మెల్యే..!

సీఎం జగన్ నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు..