‘చిత్రలహరి’, ‘ప్రతిరోజు పండగే’ వంటి సినిమాల తర్వాత సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజాగా సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’. కొత్త దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా వాలంటెన్స్ డే సందర్భంగా ఈ చిత్ర థీమ్ వీడియోను విడుదల చేశారు. ఈ సినిమా టీజర్ లో సాయి తేజ్ చెప్పే డైలాగ్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానేర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఇక సమ్మర్ కానుకగా ఈ సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also, Read: