ఏపీ వైసీపీ సర్కార్ సింగల్ గా అధికారాన్ని కైవసం చేసుకుంటే, కేంద్రంలో బీజేపీ పార్టీ కూడా సింగల్ గా అధికారాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. ఇక ఏపీ సీఎం జగన్ పార్టీ స్ట్రోమ్ తో ప్రతిపక్ష పార్టీలకు దిమ్మ తిరిగే షాక్ అని చెప్పుకోవచ్చు. ఇక ఏపీలో ఉన్న 175 పార్లమెంట్ స్థానాలలో 151 స్థానాలను వైసీపీ పార్టీ కైవసం చేసుకుంటే, 25 పార్లమెంట్ స్థానాలలో 22 స్థానాలను దక్కించుకుంది. మరొక వైపున టీడీపీ గెలుచుకున్న మూడు పార్లమెంట్ స్థానాలలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ విషయంలో కోర్ట్ లో కేసులు నడుస్తునట్లున్నాయి.

కానీ వైసీపీ పార్టీకి 151 అసెంబ్లీ సీట్లు వచ్చినా తెలుగుదేశం పార్టీని అసెంబ్లీలో లేకుండా చేయడానికి చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని తలచి 23 మంది ఎమ్మెల్యేలలో కొంతమంది తమ పార్టీలో చేర్చుకోవాలని చూస్తున్నారు. తమ పార్టీలో చేర్చుకునే క్రమంలో రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్తారని చెబుతున్నారు. ప్రజలు ఒక పార్టీ నుంచి గెలిపిస్తే ఇప్పుడు రాజీనామా చేసి మరోసారి ఎన్నికలకు వెళ్లడం… ఇదంతా ప్రభుత్వ సొమ్ము వృధా అవుతుంది కదా? వారిని తెలుగుదేశం పార్టీలోనే ఉంచవచ్చు కదా? అంటే అప్పుడు వారు లాక్కున్నారు… ఇప్పుడు మేము లాక్కుని లెక్కలు సరిచేస్తాము అంటున్నారు వైసీపీ నాయకులు.

సరే ఇక విషయానికి వస్తే వైసీపీ పార్టీ ఇలా చేస్తుంటే బీజేపీ కూడా ఏపీలో తెలుగుదేశం పార్టీకి ఉన్న ముగ్గురు ఎంపీలతో పాటు వైసీపీ ఎంపీలను కూడా లాగే పనిలో బిజీగా ఉందట. అవును వైసీపీ చేస్తే న్యాయం… బీజేపీ చేస్తే అన్యాయం ఎలా అవుతుంది. మీకు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఇంకా చేర్చుకోవాలని ఉన్నప్పుడు బీజేపీ పార్టీ కూడా అలానే చేస్తుంది. దీనికి సంబంధించి ఈరోజు సోము వీర్రాజు కూడా త్వరలో తమ పార్టీలో చేరడానికి వైసీపీ ఎంపీలు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు.

టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా కూడా తమపై బూతు పురాణం ఆపి వైసీపీ పార్టీ నుంచి 10 నుంచి 12 మంది ఎంపీలు జంప్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని ముందు వారి సంగతి చూసుకోండని సలహా ఇస్తున్నారు. అంతే అంతే జగన్ కు ఎమ్మెల్యేల మీద పిచ్చి ఉంటే… మోదికి ఎంపీల మీద పిచ్చి ఉంది. జగన్ చేసేది నీతైతే… మోదీ చేసేది కూడా నీతే… మరి బీజేపీ తమ పార్టీలో చేర్చుకొని ఎన్నికలకు వెళ్ళరు కదా అంటే, అందరూ ఎన్నికలకు వెళుతున్నారా ఏమిటి…సీఎం జగన్ రాసుకున్న గీత అలా ఉంది…పీఎం మోదీ గీసుకున్న గీత మరోలా ఉంది.