కరోనా కష్టకాలంలో ఆర్ధికంగా చితికిపోయిన అనేక మందిని బాలీవుడ్ నటుడు సోను సూద్ ఆదుకున్న సంగతి తెలిసిందే. అనేక సినిమాల్లో విలన్ నటించి మెప్పించిన ఆయన.. దేశవ్యాప్తంగా కరోనా వల్ల ఇబ్బంది పడుతున్న అనేకమందికి అండగా ఉంటూ తన వంతు సహాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నాడు. దీంతో బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోను అనేకమంది అభిమానులను సంపాదించుకున్నాడు.

ఇక తాజాగా హైదరాబాద్ లో అడుగుపెట్టిన ఆయనను ‘అల్లుడు అదుర్స్’ సినిమా యూనిట్ ఘనంగా సత్కరించింది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ‘అల్లుడు అదుర్స్’ అనే సినిమా షూటింగ్ హైదరాబాద్ లో మొదలైంది. ఈ సినిమాలో విలన్ గా నటించబోతున్నాడు సోను సూద్. ఈరోజు ఈ సినిమా సెట్స్ లోకి అడుగుపెట్టిన సోను సూద్ ను సిబ్బంది అంతా చప్పట్లు, ఉత్సాహంతో సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ప్రకాష్ రాజ్.. సోను కి శాలువా కప్పి సత్కరించారు. దీంతో ‘అల్లుడు అదుర్స్’ సెట్లో పండగ వాతావరణం నెలకొంది.

ఇక ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన అనూ ఇమ్మానుయేల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సుమంత్ ఆర్ట్స్ పతాకంపై జి.సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్నారు.

పవన్ సినిమాల జాబితా పెరిగిపోతుంది.. కొత్తగా మరో సినిమా..!

గుడ్ న్యూస్.. రష్యా వ్యాక్సిన్ విజయవంతం.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు..!

బిగ్ బాస్ హౌస్ లో రచ్చ రచ్చ.. గొడవపడ్డ నోయెల్, లాస్య..!