దేశవ్యాప్తంగా కరోనా వల్ల ఇబ్బంది పడుతున్న వారందరికి అండగా ఉంటూ తన వంతు సహాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నాడు సోను సూద్. దేశంలో కష్టం అనే మాట వినిపిస్తే వెంటనే స్పందిస్తున్నాడు. దీంతో బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోను అనేకమంది అభిమానులను సంపాదించుకున్నాడు. కరోనా కాలంలో ఉపాధిలేక అల్లాడిపోతున్న వారందరికీ దేవుడిగా నిలుస్తూ ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వాలిపోతున్నాడు. అయితే ఆయన చేస్తున్న సామాజిక సేవను తప్పుపడుతూ కొంత మంది ట్రోలింగ్ చేస్తున్నారు.

దీనిపై ఘాటుగా స్పందించాడు సోను సూద్. నేను చిన్నపుడు ఒక కథ విన్నాను. ఒక సాదు దగ్గర అద్భుతమైన గుర్రం ఉంది. ఒక బందిపోటు ఆ సాదు దగ్గరకు వచ్చి ఆ గుర్రాన్ని ఇవ్వమని కోరాడు. సాదు నిరాకరించి ముందు వెళ్ళిపోయాడు. ఇక సాదు అడవి గుండా వెళ్తుంటే అక్కడ నడవలేని వృద్దుడిని గమనించాడు. గుర్రాన్ని వృద్దుడికి ఇచ్చాడు. ఆ వృద్ధుడు గుర్రంపై కూర్చున్న క్షణం తనను తాను బందిపోటుగా పిలుచుకున్నాడు. అలా ఆ గుర్రంతో కాస్త ముందుకు కదిలాడు. ఇక సాదు సదరు వృద్ధుడిని ఆపి నువ్వు ఈ గుర్రాన్ని తీసుకెళ్లవచ్చని చెబుతాడు. కానీ నేను ఈ గుర్రాన్ని ఎలా ఇచ్చానన్న విషయం ఎవరి చెప్పవద్దని వృద్దుడికి చెబుతాడు. అతడు ఎందుకు అని అడగా, ఎందుకంటే ప్రజలు ఎప్పుడు మంచి పని చేసే వారిని నమ్మరు అని చెబుతాడు అని సోను సూద్ ఆ కథను చెప్పుకొచ్చాడు. ఇక ట్రోలర్స్ కూడా ఇదే నా సమాధానం అని అన్నాడు.

తాను ఏమి సహాయం చేయడం లేదని మోసం చేస్తున్నానని విమర్శించే వారికీ గట్టి సమాధానం చెప్పాడు. నేను ఇదంతా మీ మెప్పుకోసం చేయడం లేదు అలాగే నేను సహాయం చేసిన వారి డేటా అంతా నా దగ్గర ఉంది. వారి చిరునామాలు, ఫోన్ నంబర్లు కూడా ఉన్నాయి. కానీ వాటిని నేను బయట పెట్టాలనుకోవడం లేదు. కానీ నన్ను విమర్శించేందుకు బదులుగా బయటకి వెళ్లి ఎవరికైన సాయం చేయాలనీ కోరుతున్నా అంటూ సమాధానం ఇచ్చారు సోను సూద్.

డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్..?

భారత్ కి భారీ ఊరట.. ఒక్కరోజులోనే లక్ష మందికి పైగా రికవరీ..!

యువతిపై చేయిచేసుకున్న కార్పొరేటర్.. అరెస్ట్ చేసిన పోలీసులు..!