సోని ఇండియా భారత్ లోకి స్మార్ట్ స్పీకర్లను తీసుకు వచ్చింది. ఎస్ఆర్ఎస్-ఎక్స్ బీ402ఎం మోడల్ ను సోమవారం లుక్ చేసింది. వీటిలో అమెజాన్ స్మార్ట్ అసిస్టెంట్ అలెక్సా కూడా ఉంది. దీని ధర 24,990 రూపాయలుగా నిర్ణయించారు. ఆగస్ట్ 12 నుంచి 18 వరకు ముందస్తు బుకింగ్స్ చేసుకుంటే 19,990 రూపాయలకు స్పీకర్లు లభిస్తాయి. దీనితో పాటు 2490 రూపాయల విలువ కలిగిన ఏడీఆర్-ఎక్స్ బీ450ఏపీ హెడ్ ఫోన్ ఉచితంగా లభిస్తుంది. సోని ఇండియా భారత్ లో విడుదల చేసిన ఎస్ఆర్ఎస్-ఎక్స్ బీ402ఎం స్పీకర్లు బ్యాటరీ ఏకధాటిగా 12 గంటల పాటు పనిచేయగలదు. ఈ స్పీకర్ల కోసం అప్పుడే బారి డిమాండ్ ఏర్పడింది.  

  •  
  •  
  •  
  •  
  •  
  •