గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం(74) కన్నుమూసారు. కొద్దిరోజులుగా కరోనాతో బాధపడుతున్న ఎస్పీ బాలసుబ్రమణ్యం.. చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం రాత్రి నుండి ఆయనకు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ఆయన శుక్రవారం మధ్యాహ్నం 1.04 నిమిషాలకు మరణించినట్లు ఆయన తనయుడు చరణ్ తెలియచేసాడు.

ఇక బాలసుబ్రమణ్యం మరణం యావత్ సంగీత ప్రియులను శోకసంద్రంలో ముంచేసింది. ఆగస్టు 5న ఎస్పీబీ తనకు కరోనా సోకినట్టు ప్రకటించారు. ఆ తర్వాత చికిత్స నిమిత్తం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. అప్పటినుంచి అక్కడే చికిత్స పొందుతున్న బాలు ఆరోగ్యం గతంలో ఓసారి విషమించడంతో ఎక్మో, వెంటిలేటర్‌ సాయంతో చికిత్స కొనసాగిస్తూ వచ్చారు. అయినా ఫలితం లేకపోయింది. ఇక సోష‌ల్ మీడియాలో ప‌లువురు సెల‌బ్రిటీలు ఆయ‌న‌కు అశ్రు నివాళులు అర్పిస్తున్నారు.

24 గంటల్లో కొత్తగా 86,052 పాజిటివ్ కేసులు, 1,141 మరణాలు..!

తీవ్ర కలకలం సృష్టిస్తున్న పరువు హత్య.. అదుపులోకి 9 మంది..!

డ్రగ్స్ కేసులో విచారణకు హాజరైన ప్రముఖ హీరోయిన్..!