గాన గాంధర్వుడు బాలసుబ్రమణ్య నిన్న మధ్యాహ్నం ఈ లోకాన్ని విడిచి తుది శ్వాస విడిచారు. దాదాపుగా 17 బాషలలో 40 వేలకు పైగా పాటలు పాడి దేశంలోనే కొత్త చరిత్ర సృష్ట్టించారు. బాలు చేత పాట పాడించుకోవడానికి నెలలు తరబడి ఎదురుచూసిన దర్శక, నిర్మాతలెందరో. బాలసుబ్రమణ్యం 12 గంటలలో 21 పాటలు పాడి తన గాత్రం పవర్ ఏమిటో చూపించారు. ఆరు బాషలలో జాతీయ ఉత్తమ అవార్డులతో పాటు 2011లో పద్మ భూషణ్ అవార్డుని కూడా సొంతం చేసుకున్నారు. దేశంలోనే పాపులర్ నటులు సల్మాన్ ఖాన్, కమల్ హాసన్, రజనీకాంత్, అనిల్ కపూర్ ఇలా ఎంతో మంది నటులకు తన గొంతుని అరువుగా ఇచ్చారు.

బాలసుబ్రమణ్యం ప్రభ దేశంలో వెలిగిపోతున్న సమయంలో ప్రతి రోజు 15కు పైగా పాటలు పడిన సందర్భాలు ఎన్నో ఎనెన్నో. కానీ 12 గంటలలో 21 పాటలు అనేక సినిమాలకు సంబంధించి పాడిన చరిత్ర మాత్రం ఎప్పటికి మరిచిపోలేనిది. తమిళ, తెలుగు, కన్నడ హిందీ బాషలలో 40 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. పెళ్లిలోను, చావులోనూ, గెలిచినా, ఓడినా బాధలను దిగమింగుకోవడానికి… ఆనందసాగరంలో విహరించాలన్న మనం వినే పాటలన్ని బాలు గారు పాడినవే. బాలసుబ్రమణ్యం వయస్సు మీద పడుతున్న కొద్ది కొత్త కొత్త సింగర్ పుట్టుకొస్తున్న వేళ అతడికి అవకాశాలు తగ్గిపోయినా పాడటం మాత్రం ఆపలేదు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో తన కచేరీలతో తెలుగు వారిని మంత్రం ముగ్ధులను చేశారు. బాలు తన దేహాన్ని విడిచిపెట్టి ఈ లోకం విడిచి వెళ్ళిపోయినా తన పాటతో ఎప్పటికి ప్రతి ఒక్కరి మదిలో చిరస్థాయిగా నిలిచిపోయిన గాన గాంధర్వుడు. ఈరోజు మధ్యాహ్నం తాను ఎంతో ప్రేమగా తన అభిరుచికి తగట్లు ఏర్పరుచుకున్న తన ఫార్మ్ హౌస్ లో అంత్యక్రియలు జరగనున్నాయి.

కమర్షియల్ చట్రంలో ఇరుక్కొని కెరీర్ నాశనం చేసుకోవద్దని అగ్రహీరోకు చివాట్లు పెట్టిన బాలు

మీరు పాడకపోయినా నా చిత్రాలు హిట్ అవుతాయని బాలుపై హీరో కృష్ణ ఆగ్రహానికి కారణం ఎవరో తెలుసా?