వరుస పరాజయాలతో సతమతమవుతున్న హీరో సుశాంత్ కు ‘చిలసౌ’ సినిమాతో మంచి హిట్ వచ్చిన సంగతి తెలిసింది. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలో సుశాంత్ ఓ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ పాత్ర సుశాంత్ కి మంచి పేరు తీసుకువచ్చింది.

ఇక తాజాగా సుశాంత్ స్ప్రైట్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించబోతున్నాడు. కాగా తాజాగా ఆ బ్రాండ్ కు ఆయన చేసిన మొదటి కమర్షియల్ యాడ్ విడుదలైంది. ఇక సుశాంత్ ఎస్.దర్శన్ దర్శకత్వంలో ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే సినిమాలో నటిస్తున్నాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా పరిచయమవుతున్న ఈ సినిమాలో వెన్నిల కిషోర్, ప్రియదర్శి, అభినవ్ గోమటం కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

sushanth

  •  
  •  
  •  
  •  
  •  
  •