యంగ్ హీరో శర్వానంద్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తతం ఆయన నటిస్తున్న సినిమా ‘జాను’. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వచ్చింది. తమిళ్ సినిమా ’96’ రీమేక్ గా ఈ ‘జాను’ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల అవుతుంది. కాగా ఈ సినిమా తో పాటు శర్వానంద్ మరో సినిమాలో కూడా నటిస్తున్నాడు. కొత్త దర్శకుడు కిషోర్ రెడ్డి దర్శకత్వంలో ‘శ్రీకారం’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను సోమవారం విడుదల చేశారు.

ఇక ‘శ్రీకారం’ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన వస్తుంది. పల్లెటూరు నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శర్వానంద్ రైతుగా కనిపించనున్నాడు. 14 రీల్స్ పతాకంపై గోపి ఆచంట, రామ్ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.