సముద్రం తన గర్భంలో మనకు అంతుచిక్కని ఎన్నో ప్రశ్నలకు జవాబులను దాచుకుంది. అలాంటి వాటిలో విశ్వకర్మ నిర్మించిన శ్రీకృష్ణుని ద్వారక కూడా ఒకటి. ద్వారక నగరం క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాలకు సంబంధించినది.192 కిలోమీటర్ల పొడవు, 192 వెడల్పు అనగా సుమారు 32600 చదరపుకిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మితమై ఉండేది.

ద్వారక ఒక బంగారు నగరంగా… అందమైన పొడవైన బారులుతీరిన వీధులతో విలాసవంతమైన పెద్ద పెద్ద భవనాలతో, రత్నాలు వజ్రాలు పొదిగిన స్తంభాలతో మెరిసిపోతూ ఎంతో శోభాయమానంగా ఉండేదట.అక్కడే శ్రీకృష్ణుడు తన ఎనిమిది మంది భార్యలతో ఉండేవాడు. 16,000 మంది గోపికలకు ఒక్కొక్క రాజభవనం ఉండేది. గోల్డెన్ సిటీ అఫ్ ఇండియాగా ద్వారకను చెప్పవచ్చు.

ద్వారక ఏదో మాములు నగరం అనుకొంటే పొరపాటే అవుతుంది. 4 వేల ఏళ్లకు పూర్వమే మన మహానగరాలను తలదన్నే ఒక పెద్ద మెట్రోపాలిటన్ సిటీగా ద్వారకా గుర్తింపు పొందింది.

అత్యంత పొడవైన వీధులు, రహదారులకు అటు ఇటు రెండుపక్కలా బారులు తీరిన చెట్లతో, అక్కడక్కడా సుందరమైన ఉద్యానవనాలతో ఎంతో అందంగాఉండేది.

ద్వారకానగరం గోమతి నది… అరేబియా సముద్రంలో కలిసే దగ్గర శ్రీకృష్ణుడు విశ్వకర్మతో సర్వాంగ సుందరంగా ఈ నగరాన్ని నిర్మింపచేసాడు. ఇక్కడ ప్రతి వర్గం వారికి అక్కడ ఒకే ప్రాంతంలో ప్రజావసరాలకు అనుగుణంగా ఆధునిక హంగులతో కట్టడాలు నిర్మించారు. అప్పట్లోనే భూగర్భ మురుగునీటి వ్యవస్థ కూడా ఉండేది.సుమారు 9,00,000 పైచిలుకు రాజభవనాలు ద్వారకలో ఉండేవి.

సుమారు 1980 దశకంలో గుజరాత్ లో పురాతత్వ శాస్త్రవేత్తలు మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ Oceanography వాళ్ళు చేసిన సర్వేలో తేలింది. ఈ ద్వారక నగర నిర్మాణమే భారతదేశాన్ని ప్రపంచపటంలో ఎంతో గొప్ప స్థానంలో నిలబెట్టింది.