ఒక వ్యక్తి దాదాపుగా ప్రపంచాన్ని చూడకుండా తన చేతిలో మొబైల్ లేకుండా తన బంధువులను, పిల్లలను తన రక్తసంబంధాన్ని వదిలేసి కొంతమంది తనతో పాటు వచ్చిన వారితో రియల్ గేమ్ ఆడుతూ రియల్ ఫైట్స్ చేస్తూ చివరి వరకు పోరాడితే బిగ్ బాస్ ఇచ్చే కప్ కోసం కంటెస్టెంట్స్ అందరు తమ శాయశక్తులా పోరాడతారు. దీనిపై ఇప్పుడు బిగ్ బాస్ 3 రన్నర్ శ్రీముఖి తన విశేషాలను తెలియచేసింది.

బిగ్ బాస్ హౌస్ లో మొదటి నుంచి లోపల ఉండేవారికి సరైన ఫుడ్ దొరకదని, వారిని పస్తులు ఉంచుతారని, సరిగ్గా నిద్రపోయే అవకాశం కూడా ఇవ్వరని వ్యాఖ్యానాలు వినపడుతున్నాయి. దీని గురించి శ్రీముఖి చెబుతూ అదంతా ట్రాష్ అని తమకు కావలసిన వెరైటీ డిష్ లు బిగ్ బాస్ హౌస్ లో లభిస్తాయని, బిగ్ బాస్ హౌస్ లో తాను పుష్టిగా తినడంతో వెయిట్ కూడా పెరిగానని, ఎవరికైనా ఇలాంటి ఆలోచన ఉంటే విరమించుకోండని చెబుతుంది.

ఇక మరోవైపున బిగ్ బాస్ హౌస్ లో నిజమైన విన్నర్ ఎవరైనా ఉన్నారంటే అది బాబా భాస్కర్ అని అన్నారు. తనకు గతంలో రాహుల్ సిప్లిగంజ్ స్నేహితుడని, ఇప్పుడు కూడా స్నేహితుడే అని… బిగ్ బాస్ హౌస్ లో జరిగిన వాటిని తాను అక్కడే మర్చిపోయానని బిగ్ బాస్ హౌస్ లో నాతో ఉన్న వారందరు తనకు స్నేహితులే అని తెలియచేసింది. తాను బిగ్ బాస్ హౌస్ లో ఒక టాస్క్ సందర్భంగా వేయించుకున్న బిగ్ బాస్ “ఐ” టాటూ రియల్ అని… అది ఎప్పటికి ఉండిపోతుందని చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ జర్నీలో తాను విన్నర్ గా నిలవకపోయినా బిగ్ బాస్ హౌస్ ఎక్స్ పీరియన్స్ చాల ఆనందాన్ని ఇచ్చిందని శ్రీముఖి చెప్పుకొచ్చింది.