తెలుగు బిగ్ బాస్ 3 రేటింగ్స్ లేక, బిగ్ బాస్ యాజమాన్యం కిందా మీద పడుతుంటే మరోవైపున వివాదాలతో కూడా తలబొప్పి కడుతుంది. తెలుగు బిగ్ బాస్ 3 హౌస్ లో శ్రీముఖి కంటెస్టెంట్ గా ఉన్నారు. ఇప్పుడున్న కంటెస్టెంట్ లలో ఆమెకే కాస్త చెప్పుకోతగ్గ పేరుతో పాటు, ఫేమ్ కూడా ఉంది. ఇక బయట అభిమానుల మధ్య జరిగే రచ్చ తెలిసే ఉంటుందిగా. తమకు నచ్చని కంటెస్టెంట్ ల మీద ట్రోల్ చేస్తూ ఉంటారు.

అలాగే నకిలీ అకౌంట్ లతో శ్రీముఖిపై ద్రుష్పరం మొదలు పెట్టిన కొంతమంది ఆకతాయిల పోస్టుల ఆధారంగా ఒక ఆంగ్ల పత్రిక శ్రీముఖిపై దృష్ప్రచారం చేస్తున్నారని, శ్రీముఖి బంధువులు జూబ్లీహిల్స్ పోలీసులకు పిర్యాదు చేశారు. శ్రీముఖిపై దృష్ప్రచారం చేస్తున్న వారితో పాటు, ఆ పత్రికపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. అసలు బిగ్ బాస్ అంటేనే వివాదాలు, విమర్శలు… అలకలు… బుజ్జగింపులు… ఇలా లోపల ఎన్ని ఉంటాయో వాటికీ తగ్గట్లే బయట కూడా ట్రోలింగ్ అదిరిపోతుంటుంది. వీటిపై మరల కేసులు… గొడవలు… తిట్టుకోవటాలు… కొట్టుకోవటాలు… అసలే బిగ్ బాస్ రేటింగ్స్ లేవురా బాబో అంటుంటే ఈ సరికొత్త గోల ఏమిటో…

  •  
  •  
  •  
  •  
  •  
  •