ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ఫైనల్ లో రాహుల్ విన్నెర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి పేరున్న శ్రీముఖి రన్నర్ గా నిలిసింది. బిగ్ బాస్ విన్నెర్ గా నిలిచిన రాహుల్ 50 లక్షల ప్రైజ్ మనీని దక్కించుకోగా శ్రీముఖికి నిర్వాహకులు అంతక మించి అమౌంట్ ని ముట్టచెప్పినట్లు సమాచారం.

బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన శ్రీముఖి ఆ షోలో ఏకంగా 105 రోజులు పాల్గొన్న సంగతి తెలిసిందే. బుల్లితెరపై తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్న ఆమె.. బిగ్ బాస్ లో ఉండేందుకు రోజుకు లక్ష రూపాయలు డిమాండ్ చేసిందట. 105 రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఉండడంతో కాంట్రాక్టు ప్రకారం ఆమె 1.05 కోట్లు ఆమె దక్కించుకుంది. టైటిల్ విన్నర్ రాహుల్ ఇతర కంటెస్టెంట్ లతో పోలిస్తే శ్రీముఖి రెమ్యూనరేషన్ చాలా ఎక్కువ కావడం విశేషం.