బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 గత వారం మొదలైతే ఈరోజు మొదటి ఎలిమినేషన్ జరగనుంది. ఇప్పటికే ఎలిమినేషన్ ఈ వారం సూర్య కిరణ్ అని చాలా మంది సోషల్ మీడియాలో వ్యాఖ్యానాలు చేస్తున్నారు. బిగ్ బాస్ పై అనేక మంది అనేక రకాల వ్యాఖ్యానాలు చేస్తుంటే నటి శ్రీరెడ్డి కూడా తనదైన శైలిలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పై విరుచుకుపడింది. తనకు బిగ్ బాస్ చూడటం ఇష్టముండదని, అక్కడ అంత దొంగ ఏడుపులు అని ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొనడం కోసం చాల మంది నటిస్తారని, కానీ తనను బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొని వెళితే ఒకొక్కరి బతుకు బయటపెడతానని ఘాటుగా స్పందించింది.

తాను కనుక వెళితే ఇప్పుడు ఫేక్ షో ను రియాలిటీ పేరుతో చూపించడం కుదరదని, తాను అందరి జాతకాలు బయటపెడతాననే తన జోలికి ఎవరు రారని అన్నట్లు వ్యాఖ్యానాలు చేసింది. బిగ్ బాస్ 4 లో ఉన్న కంటెస్టెంట్స్ మాములు వారేం కాదని, ఒకొక్కరకి ఒక్కోరకమైన జాతకముందని బిగ్ బాస్ ను కెలికే పని చేసింది. గతంలో కూడా శ్రీరెడ్డి అనేకమందిపై అనేక ఆరోపణలు చేసిన సంచలనం కలిగించింది. శ్రీరెడ్డి లీక్స్ పేరుతో చాల మంది డైరెక్టర్స్, ప్రముఖ హీరోల గురించి చెప్పి వారిని ముప్పుతిప్పలు పెట్టిన సంగతి తెలిసిందే. క్యాస్టింగ్ కోచ్ ఆరోపణల నేపథ్యంలో ఏకంగా అర్ధనగ్నంగా దర్శనమిచ్చి టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద షాక్ ఇచ్చింది.