యాషెస్ సిరీస్ లో ఆస్ట్రేలియా కెప్టెన్ కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. తన ఆట తీరుతో ప్రత్యర్థి ఇంగ్లాండ్ కు చుక్కలు చూపిస్తున్నాడు. సెంచరీల మీద సెంచరీలు చేస్తూ ఆస్ట్రేలియాను విజయ తీరాలకు చేరుస్తున్నాడు. ఇక స్టీవ్ స్మిత్ తన ఆటతో తనపై పడిన స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలను పూర్తిగా తుడిచివేసుకోవాలని చూసినా ఇంగ్లాండ్ ఆటగాళ్లతో పాటు, ఇంగ్లాండ్ అభిమానులు అతనిని వదిలేలా లేరు.

ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు స్టీవ్ హర్మిషన్… స్టీవ్ స్మిత్ చేసిన స్పాట్ ఫక్సింగ్ అతను బతికినంత వరకు అతడిని విడిచిపోదని, అతను క్రీడా స్ఫూర్తిని దెబ్బతీసేలా ప్రవర్తించడంతో పాటు మోసగాడిగా ముద్రవేసుకున్నాడని, మీరు ఎంత గొప్పగా ప్రదర్శన చూపించిన మీపై ఉన్నమచ్చ పోదని స్టీవ్ హర్మిషన్ వ్యాఖ్యలు చేశాడు. ఇక స్టీవ్ స్మిత్ తన అద్భుతమైన ఆటతో ఆస్ట్రేలియాను విజయతీరాలకు చేరుస్తుంటే ఇంగ్లాండ్ ఆటగాళ్లు స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు చేస్తూ గిల్లుతున్నారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •