ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. భారీ నష్టాలలో ట్రేడింగ్ ను ముగించాయి. సెన్సెక్స్ ఏకంగా 624 పాయింట్లు, నిఫ్టీ 184 పాయింట్ల నష్టపోయాయి. ముఖ్యంగా బజాజ్ ఫైనాన్స్, ఎయిర్టెల్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్స్ భారీగా విలువ కోల్పోయాయి. మరో పక్క హెవీ వెయిట్ షేర్ రిలయన్స్ 10 శాతానికి పైగా లాభ పడినా మార్కెట్ పతనాన్ని ఆపలేక పోయింది. కాగా ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలడంతో బంగారం ధర పెరిగింది. ముఖ్యంగా యూరప్, అమెరికా మార్కెట్లు మంగళవారం పడిపోవడంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది.

  •  
  •  
  •  
  •  
  •  
  •