సుజనా చౌదరి దాదాపుగా 6 వేల కోట్ల రూపాయలు బ్యాంకులను మోసం చేసి వాటి నుంచి తప్పించుకోవడానికి బీజేపీ పార్టీలో చేరాడని ఎప్పుడు వైసీపీ పార్టీ సభ్యులు ఆరోపిస్తుంటారు. బ్యాంకులను మోసం చేసి రేపో మాపో జైలుకు వెళ్ళవలసి వస్తుందన్న బాధ సుజనా చౌదరికి అర్ధమవుతున్నట్లు ఉందని, లేకపోతే చంద్రబాబు బినామీగా ఉండే వ్యక్తి బీజేపీలోకి ఎలా వెళ్తాడని ప్రశ్నిస్తున్నారు.

ఇతను బీజేపీలోకి వెళ్లిన ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కోసం పాకులాడుతున్నట్లు ఉంటుంది. కొత్తగా ఏపీలో తెలుగు దేశం పార్టీకి చెందిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీని విడిచి వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్న వేళ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు అతడి కొడుకు లోకేష్ పై ఘాటైన విమర్శలకు దిగాడు. ఇక వంశీ బాటలో మరికొందరు ఉన్నారని ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఇక విశాఖకు చెందిన ఎమ్మెల్యేలు ఇలా జగన్ తో చాల మంది టచ్ లో ఉండటమే కాకుండా మాజీ మంత్రులు కూడా వైసీపీ బాట పట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు.

దీనితో చంద్రబాబు నాయుడు రోజుకొక జిల్లా చుడుతూ జగన్ సర్కార్ పై విమర్శలు చేస్తూ తన పార్టీ నాయకులను కాపాడుకునే పనిలో ఉన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్న విషయాన్ని పక్క దారి పట్టించడానికి సుజనా చౌదరి బయటకు వచ్చి తమతో కూడా వైసీపీ ఎంపీలు టచ్ లో ఉండరని, త్వరలో బీజేపీలో చాల మంది ఎంపీల చేరికలు ఉంటాయని చెప్పడం చూస్తుంటే చంద్రబాబు నాయుడు మీద సుజనా చౌదరికి ఉన్న ప్రేమను ఇంకా బీజేపీ పార్టీ గుర్తించకపోవడం అవివేకమని చెప్పుకోవచ్చు.

ఎన్నికల ముందు బీజేపీ పార్టీని బండ బూతులు తిట్టి ఎన్నికలు ముగిసిన తరువాత తెలుగుదేశం పార్టీని వీడి నాలుగు రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వెళ్లిన చంద్రబాబు నాయుడు చిన్న మాట కూడా మాట్లాడలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక సుజనా చౌదరి మరికొందరు బీజేపీలో చేరిన చంద్రబాబు బ్యాచ్ మాటలకు ఏపీలో ఉన్న నిజమైన పార్టీ లీడర్స్ కు వారిలో ట్రాప్ లో పడినట్లున్నారు.