యూఎస్ ఓపెన్ తొలి రౌండ్ లోనే మాజీ వరల్డ్ ఛాంపియన్ రోజర్ ఫెదర్ కు భారత్ యువ ప్లేయర్ సుమిత్ నగల్ చమటలు పట్టించాడు. వీరిద్దరి మధ్య జరిగిన మ్యాచ్ లో తొలి సెట్ 6-4 తేడాతో సుమిత్ గెలిచి షాక్ ఇచ్చాడు. ఆ తరువాత జరిగిన రెండు సెట్లను ఫెడరర్ సునాయాసంగా 6-1, 6-2 తేడాతో గెలిచి ఉపిరి పీల్చుకున్నాడు. ఇక నాలుగవ సెట్ లో కూడా సుమిత్ టఫ్ ఫైట్ ఇవ్వడంతో, రోజర్ ఫెదరర్ తన అనుభవంతో 6-4 తేడాతో సెట్ కైవసం చేసుకొని విజయం సాధించాడు. మొత్తం రెండున్నర గంటలు జరిగిన మ్యాచ్ ఆధ్యంతం భారత్ యువ ప్లేయర్ సుమిత్ ఆకట్టుకున్నాడు.

  •  
  •  
  •  
  •  
  •  
  •