కొడుకంటే ఎవరకి ప్రేమ ఉండదు చెప్పండి, ఆ కొడుకు సినిమాలలో నటిస్తూ జీవిస్తు బాధపడుతున్నా… నిజ జీవితంలో కన్నీళ్లు కారుస్తున్న కన్న పేగు తట్టుకోగలదా. ఇలాంటి సంఘటనే ఈమధ్యే రామోజీ ఫిల్మ్క్ సిటీలో జరిగిందట. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ – ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న “ఆర్ఆర్ఆర్” సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రామ్ చరణ్ తేజ్ “అల్లూరి సీతారామ రాజు పాత్రలో” పోషిస్తున్నాడు.

ఈమధ్య షూటింగ్ సెట్ కు చిరంజీవి దంపతులు రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లారట. ఇక వారు సెట్ కు వెళ్లిన సందర్భంలో సీతారామరాజును ఒక సన్నివేశంలో ఆయనకు ఎదురైనా ఒక సంఘటనలో తాళ్లతో కట్టి, కొడుతూ ఈడ్చుకెళ్లి సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. ఆ సన్నివేశాలను రాజమౌళి చాల సహజ సిద్ధంగా చిత్రీకరిస్తుండటంతో చిరంజీవి చాల ఎమోషనల్ కు గురయ్యాడట. ఇక రామ్ చరణ్ తల్లి సురేఖ అయితే కన్నీటి పర్యంతం అయ్యిందట. అప్పుడు చరణ్ ఇది సినిమా మాత్రమే అని చెబుతున్న ఆమె కన్నీళ్లు ఆపుకోలేకపోయిందట.

చిరంజీవి కూడా సీతారామరాజును ఇంత దారుణంగా చిత్రహింసలు పెట్టారా అని మరింత ఉద్వేగానికి లోనయ్యారట. రాజమౌళి చాల సహజ సిద్ధంగా చిత్రీకరించడంతో ఆ సన్నివేశానికి ప్రాణం పోయడానికి చరణ్ పడుతున్న కష్టం అమోఘమని, రామ్ చరణ్ ఈ సినిమాతో మరొక మెట్టు పైకెక్కుతాడని అంటున్నారు. “రంగస్థలం” సినిమాతో మంచి నటుడిగా గుర్తింపు పొందిన రామ్ చరణ్ ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా సత్తా చూపిస్తాడని అంటున్నారు. ఈ సినిమాలో మరొక హీరోగా చేస్తున్న ఎన్టీఆర్ “కొమరంభీం” పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది 2020 జులై 20న విడుదల కానుంది.