అఖిల్ అక్కినేని ఇండస్ట్రీలో అడుగుపెట్టే సమయంలో అతడికి ఫుల్ హైప్ వచ్చేసింది. ఆరడుగుల అందగాడు సినిమా ఇండస్ట్రీని ఏలేస్తాడని ఇలా అనేక కథనాలు వెలువడ్డాయి. కానీ ఇప్పటి వరకు విడుదలైన సినిమాలలో ఒక మంచి హిట్ కూడా కొట్టలేకపోవడంతో అతడిపై రోజు రోజుకి సినిమా ఇండస్ట్రీలో ఆసక్తి తగ్గిపోతుంది. ప్రస్తుతం అతడు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చిన తరువాత కరోనా దెబ్బతో షూటింగ్ ఆగిపోయింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం షూటింగ్స్ పర్మిషన్ ఇవ్వడంతో మిగిలిన పార్ట్ కంప్లీట్ చేసే విడుదల చేసే అవకాశం ఉంది.

ఈ సినిమా తరువాత హీరో అఖిల్ దర్శకుడు సురేందర్ రెడ్డితో ప్రాజెక్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఇప్పటికే కథ సిద్ధమైనా నిర్మాత దొరకక అష్టకష్టాలు పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సురేందర్ రెడ్డికి బన్నీ వాసుతో మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. ఈ ప్రాజెక్ట్ బన్నీ వాసుతో చేద్దామని సురేందర్ రెడ్డి ప్రతిపాదిస్తే… బన్నీ వాసు మాత్రం ఈ ప్రాజెక్ట్ ను అనిల్ సుంకరకు ప్రపోజ్ చేసాడట. ప్రస్తుతం బన్నీ వాసు అఖిల్ తో “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” సినిమా నిర్మిస్తున్నారు. అలాగని మరొక సినిమా వెంటవెంటనే చేయకూడదని కాదు.

కానీ అతడు ఆసక్తి చూపకపోవడంతో బాల్ అనిల్ సుంకర కోర్టులో ఉంది. కానీ అనిల్ సుంకర కూడా ప్రస్తుతం తన చేతిలో రెండు, మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయని ప్రస్తుతం తన వల్ల కాదని, ఒకప్పుడు తాను భాగస్వామ్యంగా ఉన్న 14 రీల్స్ బ్యానేర్ వారికి సజెస్ట్ చేసాడట. వారు కూడా ఒకడుగు ముందుకు, నాలుగడుగులు వెనక్కు వేస్తూ ప్రాజెక్ట్ టేక్ అప్ చేయడానికి ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. అక్కినేని వారబ్బాయికి ఇలాంటి పరిస్థితి రావడం కాస్త ఇబ్బందికరమే. ఇక దర్శకుడు సురేందర్ రెడ్డి మంచి ప్రామిసింగ్ సినిమాలు చేస్తూ పెద్ద పెద్ద హీరోలతో ఇన్ని రోజులు డీల్ చేసి ఇప్పుడు అఖిల్ లాంటి చిన్న హీరోతో సినిమా చేసే సమయంలో నిర్మాత దగ్గర అష్టకష్టాలు పడటం అతడికి కాస్త ఇబ్బందికరమే. చివరకు ఈ ప్రాజెక్ట్ ఎవరు టేక్ అప్ చేస్తారో అనే వార్త కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంది.

పెళ్ళైన కొద్దిసేపటికే ప్రియుడుతో ముద్దు పెట్టించుకుని వరుడికి రామ్ రామ్ చెప్పిన నవ వధువు

యాంకర్ ప్రదీప్ పై రేప్ కేసు, సంచలన ఆరోపణలు