‘సైరా నరసింహారెడ్డి’ సినిమా మంచి విజయాన్ని అందుకునం దర్శకుడు సురేందర్ రెడ్డి త్వరలో ప్రభాస్ హీరోగా దిల్ రాజు ప్రొడక్షన్ లో సినిమా మొదలు పెట్టబోతున్నారని వ్యాఖ్యానాలు వినపడుతున్నాయి. దీని గురించి టాలీవుడ్ సర్కిల్ లో కథలు కథలుగా చెబుతున్నారు. ఇక సురేందర్ రెడ్డి ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనను ఎన్టీఆర్ మేనేజర్ ఎలా ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేశాడన్న విషయం చెప్పుకొస్తున్నాడు.

సురేందర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమైంది కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన “అతనొక్కడే” సినిమాతో. ఆ సినిమాలో కొత్త పంథాలో స్క్రీన్ ప్లేను ప్రెజెంట్ చేసి ఔరా అనిపించుకున్నాడు. ఇక ఆ సినిమా సూపర్ హిట్ సాధించిన తరువాత తాను వెంటనే ప్రభాస్ హీరోగా సినిమా చేయవలసి ఉంది. అప్పటికే ప్రభాస్ తో సినిమా చేయడానికి కమిట్ అయ్యాను. కానీ తనను తారక్ మేనేజర్ సుకుమార్ కలవాలని చెప్పాడు. తారక్ అప్పటికే పెద్ద హీరో. చెప్పినప్పుడు కలవకపోతే బాగోదు కదా అని వెళ్లి కలిసాను.

వరుసగా మూడు రోజులు తనను తారక్ తో సినిమా చేయాలని నీ డైరెక్షన్ స్టైల్ బాగుందని గట్టిగా ప్రెజర్ చేశారు. కానీ వారు ఒక స్టోరీ చెప్పి ఈ కథతో చేయాలని చెప్పగా అది తన స్టైల్ లో లేదని వేరే కథతో తారక్ హీరోగా సినిమా చేసానని అదే “అశోక్” సినిమా అని సురేందర్ రెడ్డి చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్ని ఇప్పుడు గుర్తు చేసి ప్రభాస్ తో తాను త్వరలో సినిమా చేయబోతున్నానని చెప్పకనే చెప్పాడు. సురేందర్ రెడ్డి ఇలా ఎన్టీఆర్ గురించి చెప్పడంతో సోషల్ మీడియాలో అనేక రకాల ట్రోలింగ్స్ అప్పుడే మొదలయ్య్యాయి.