వచ్చే నెల సెప్టెంబర్ 17 నుంచి ఐపీఎల్ సీజన్ దుబాయ్ వేదికగా మొదలు కానుంది. డబ్బుకు కక్రుత్తి పడి ఎక్కడ తమకు నష్టాలొస్తాయేమో అని బీసీసీఐ ఐపీఎల్ ను ఎలాగైనా నిర్వహించాలని దుబాయ్ లో కరోనా కేసులు తక్కువ ఉండటంతో అక్కడ ఏర్పాటు చేశారు. కానీ సరిగ్గా వారం రోజుల క్రితం ఐపీఎల్ కోసం దుబాయ్ చేరుకున్న చెన్నై సూపర్ కింగ్స్ లోని జట్టు సభ్యుడు సురేష్ రైనా ఇప్పుడు ఐపీఎల్ నుంచి ఏకంగా తప్పుకోవడం సంచలనంగా మారింది.

చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం మాత్రం అతడు వ్యక్తిగత కారణాల వలన ఐపీఎల్ నుంచి తప్పుకున్నట్లు చెప్పుకొస్తున్నారు. అతడికి చెన్నై సూపర్ కింగ్స్ ఎప్పటికి అండగా ఉంటుందని చెప్పుకొచ్చారు. నిన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఫేస్ బౌలర్ తో పాటు జట్టులోని సహాయకులకు దాదాపుగా 13 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వార్తలు వచ్చాయి. ఈరోజు సురేష్ రైనా ఐపిఎల్ నుంచి తప్పుకొని ఇండియా వచ్చేయడానికి కారణం కరోనా వైరస్ భయమే అనే ఆరోపణలు వినపడుతున్నాయి.

అతడి కుటుంబసభ్యులు కూడా కరోనా వైరస్ తో ఆందోళన చెందుతుండటంతో రైనా ఇప్పుడు ఐపీఎల్ నుంచి తప్పుకొని ఇండియా వచ్చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇంకా ఐపీఎల్ కు దాదాపుగా 20 రోజుల సమయముంది. ఈ 20 రోజులలో ఇంకెంతమంది ఆటగాళ్లు ఐపీఎల్ కు రామ్ రామ్ చెప్పి తప్పుకుంటారో చూడాలి. ఒక ఏడాది ఐపీఎల్ ఆడకపోతే పొయ్యే నస్టమేమి లేదు కదా? ముందు ప్రాణాలు కాపాడుకుంటే ఐపీఎల్ ఎప్పుడైనా ఆడుకోవచ్చనే బావనలోకి క్రీడాకారులు రాక తప్పని పరిస్థితి.

గత పన్నెండేళ్లుగా తన సోదరుడు స్థానంలో ఉద్యోగం చేస్తున్నా పసిగట్టలేకపోయారు

సినిమాను తలపించేలా కట్నం ఇవ్వలేదని పెళ్లి పీటలపై నుంచి లేచిపోయాడు

ఇతను మాములు పోలీస్ కాదు బాసు, ఎవరైనా సెల్యూట్ చేయాల్సిందే