ఈనెల ఆగస్ట్ 15న అంతర్జాతీయ క్రికెట్ కు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో కలసి గుడ్ బై చెప్పిన సురేష్ రైనా ఐపీఎల్ కోసం వారం రోజుల క్రితం దుబాయ్ వెళ్ళాడు. దుబాయ్ వెళ్లిన రెండు మూడు రోజులకే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బౌలర్ దీపక్ చాహార్ తో పాటు మరొక 13 మంది సహాయకులకు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో దీనిపై రైనాతో పాటు అతడి భార్య ప్రియాంక ఆందోళన చెందారట. తన భార్యతో మాట్లాడి తమకు మా పిల్లల కంటే ఏది ముఖ్యం కాదని అందుకే ఐపీఎల్ కు వీడ్కోలు పలికి తిరిగి వచ్చేసినట్లు చెప్పుకొచ్చాడు. రైనా, ప్రియాంక దంపతులకు 4 మరియు 5 ఏళ్ళ గ్రీసియా, రియో అనే ఇద్దరు చిన్నారులున్నారు.

వారి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని కరోనా సోకితే రాబోయే రోజులలో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందన్న కారణంగా అతడు ఐపీఎల్ వదిలి వెళ్లినట్లు తెలుస్తుంది. ఇక రైనా ఐపీఎల్ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న తరువాత తన మామ హత్యకు గురైనట్లు తెలుసుకున్నాడు. ముందుగా అందరూ తన మామ కోసం ఐపీఎల్ వదిలేసి వస్తున్నట్లు భావించారు. తన మామ మరణవార్త కన్నా ముందే ఐపీఎల్ వీడి రావాలని రైనా నిర్ణయం తీసుకున్నాడట. ఒకవైపున కరోనా వైరస్ ఉదృతంగా వ్యాపిస్తున్నా మొండిగా బీసీసీఐ ఐపీఎల్ టోర్నీకి సన్నాహాలు చేయడంతో విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ముంబై పోలీసుల రక్షణ నాకు వద్దు బాబోయ్ అని వేడుకుంటున్న కంగనా రనౌత్