చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో బలమైన ఆటగాడిగా కొనసాగుతున్న సురేష్ రైనా ఈరోజు ఉదయం హఠాత్తుగా తాను ఐపీఎల్ నుంచి వైదొలిగి ఇండియా పయనమవుతున్నాడని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రకటించడంతో అందరూ విస్తుపోయారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో సబ్యులకు కరోనా పాజిటివ్ రావడంతోనే అతడు జట్టుని వీడి ఇండియా వస్తున్నట్లు ఉదయం నుంచి కామెంట్స్ వినిపించాయి. కానీ రైనా ఐపీఎల్ వదిలి రావడానికి కారణం అతడి మేనమామ భర్తను దుండగులు అతి కిరాతకంగా చంపడంతో రైనా షాక్ కు గురై తిరిగి ఇండియాకు వచ్చేస్తున్నట్లు తెలుస్తుంది.

పంజాబ్ రాష్ట్రం పఠాన్ కోట్ సమీపంలో మధోపూర్ గ్రామంలో నివసించే రైనా మేనమామ కుటుంబంపై నిన్న రాత్రి దుండగులు ఇంట్లో దోపిడీకి యత్నించడంతో వారిని ఎదుర్కొనే దానిలో భాగంగా దుండగులు బలమైన రాడ్లతో కుటుంబసభ్యులపై విరుచుకుపడటంతో రైనా మేనమామ చనిపోవడంతో పాటు మరొక నలుగురు కుటుంబసభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. రైనా మేనమామ అశోక్ ప్రభుత్వ కాంట్రాక్టర్ గా బాగా స్థిరపడిన ఫ్యామిలీ. అతను చనిపోవడంతో రైనా తిరిగి ఇండియాకు బయలుదేరారు. తీవ్ర గాయాలతో మరొక నలుగురు కుటుంబసభ్యులు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రైనా నేరుగా వారింటికి వెళ్లి ఆ కుటుంబసభ్యులను పరామర్శించనున్నారు. దుండగులు కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

కరోనా పాజిటివ్ అని చెప్పి 14 రోజుల తరువాత తూచ్ అసలు కరోనానే సోకలేదని చెప్పడంతో విస్తుపోయిన యువతి

నేను 2017 నుంచి ప్రెగ్నెంట్, కానీ బేబీ ఎందుకో బయటకు రావడం లేదు

తొలిసారి కన్నా రెండవసారి కరోనా సోకితే లక్షణాలు చాలా తీవ్రంగా ఉన్నాయంటున్న అమెరికా