లాక్ డౌన్ పుణ్యమాని ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌కు ప్రేక్షుకుల ఆదరణ బాగా పెరిగిపోయింది. ఇప్పటికే అనేక సినిమాలు షూటింగులు పూర్తి చేసుకుని రెడీగా ఉన్నాయి. కానీ థియేటర్లు మూసివేత కారణంగా విడుదలకు నోచుకోవడం లేదు. ఇప్పటికే కొన్ని సినిమాలు ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌లో విడుదలయిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా స్టార్ హీరో సూర్య సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతుందని తెలుస్తుంది.

సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సూరారై పొట్రు’. ‘గురు’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న లేడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ అనే పేరుతో విడుదలకానుంది. అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సిఖ్య ఎంటెర్టైన్మెంట్స్ మరియు 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ఫ్యాన్సీ రేటుకు కొనుకోలు చేసిందని సమాచారం. అతి త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతుందని తెలుస్తుంది.

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డేకు డబుల్‌ బొనాంజా..!

వాటితో పుక్కిలిస్తే తగ్గుతున్న కరోనా..!

బిగ్ న్యూస్.. కరోనాకు వ్యాక్సిన్ విడుదల చేసిన రష్యా..!