బాలీవుడ్ హీరో దివంగత సుశాంత్ హీరోగా నటించిన చివరి సినిమా “దిల్ బేచారా” సినిమా ట్రైలర్ సరికొత్త రికార్డ్స్ దిశగా దూసుకుపోతుంది. ఈ సినిమా ట్రైలర్ కు ఇప్పటి వరకు 24 మిలియన్ వ్యూస్ రాగా 5.4 మిలియన్ లైక్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో సుశాంత్ సింగ్ కు జోడిగాసంజన సింగీ నటించింది. ఈ సినిమాను 2014లో వచ్చిన “ది పాల్డ్ ఇన్ అవర్ స్టార్స్” నవల ఆధారంగా తెరకెక్కించడం జరిగింది.

ఈ సినిమాను ముఖేష్ చాబ్రా దర్శకత్వం వహించారు. సుశాంత్ సింగ్ చనిపోయిన తరువాత ముఖేష్ చాబ్రా మాట్లాడుతూ జీవితంలో మనమిద్దరం కలసి ఎన్నో సినిమాలలో ప్రయాణం చేయవలసి ఉందని, కానీ ఇలా సినిమా విడుదలకు ముందే నువ్వు నన్ను ఒంటరిని చేసి వెళ్లిపోవడం విషాదాన్ని నింపిందని అన్నారు. ఈ సినిమాను హాట్ స్టార్ లో సుశాంత్ సింగ్ అభిమానుల కోసం ఉచితంగా అందించనున్నారు. త్వరలో ఈ సినిమా విడుదలకు సన్నద్ధమవుతుంది.