దసరా, దీపావళి పండుగలు ఒకే నెల అక్టోబర్ లో రావడంతో సరికొత్త పండుగ ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకునే పనిలో అన్ని కంపెనీలు పోటీ పడుతున్నాయి. అందులో భాగంగా సుజుకి మోటార్ ఇండియా సరికొత్త ఆఫర్ తో వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. కేవలం 777 రూపాయల డౌన్ పేమెంట్ తో బైక్ లేదా స్కూటర్ కొనుగోలు చేసే సదావకాశాన్ని కల్పిస్తుంది.

అంతే కాకుండా లోనే ప్రాసెసింగ్ కు సంబంధించి ఫీజును కూడా మినహాయింపు ఇవ్వనుండటం గమనార్హం . ఇక మీరు ప్రభుత్వ ఉద్యోగులైతే జిక్సర్, యాక్సెస్ టూవీలర్లపై 3 వేల రూపాయల వరకు అదనపు ప్రయోజనం కల్పిస్తుంది. HDFC బ్యాంకు ద్వారా 1500 రూపాయలు, పేటిఎం ద్వారా 8500 రూపాయలు కాష్ బ్యాక్ లభించనుంది. కొత్త బైక్ లేదా స్కూటర్ కొనాలని అనుకున్న వారికి ఇది మంచి ఆఫర్ అని చెప్పుకోవచ్చు.