వెంకటేశ్వరా భక్తి ఛానెల్ బోర్డు అఫ్ డైరెక్టర్ గా ప్రముఖ దర్శకుడు శ్రీనివాసరెడ్డి పదవి భాద్యతలు స్వీకరించారు. తిరుమలలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్త వెంకటేశ్వర్లు, ఎస్విబీసీ ఛానెల్ చైర్మన్ పృద్వి, తిరుపతి ఎంపీ దుర్గా ప్రసాద్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. వెంకటేశ్వరా భక్తి ఛానెల్ బోర్డు అఫ్ డైరెక్టర్ గా భాద్యతలు చేపట్టడం చాలా ఆనందంగా ఉందన్నారు.

ఇక గతంలో శ్రీనివాసరెడ్డి అదిరిందయ్యా చంద్రం, బొమ్మనా బ్రదర్స్ చందనా సిస్టర్స్, యమగోల మళ్ళీ మొదలైంది, డమరుకం వంటి హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఆయన సత్యదేవ్, ఈషా రెబ్బ ప్రధాన పాత్రలలో ‘రాగల 24 గంటలలో’ సినిమాను తెరకెక్కిస్తున్నారు.