ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ తమను మోసం చేస్తుందంటూ డెలివరీ బాయ్స్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా నిరసన వ్యక్తం చేసిన డెలివరీ బాయ్స్.. స్విగ్గీ కంపెనీ తమకు కమీషన్ తక్కువుగా ఇస్తుందని ఆందోళన చేశారు. స్విగ్గీ యాజమాన్యం థర్డ్ పార్టీని పెట్టి తమ పొట్టకొడుతుందని.. గతంలో 2 కిలోమీటర్ల లోపు ఒక ఐటం డెలివరీ చేస్తే 35 రూపాయలు ఇచ్చిన సంస్థ.. నేడు భారీగా కోత విధించిందని అన్నారు. ఇప్పుడు ఒక కిలోమీటర్ పరిధిలోపు డెలివరీ చేస్తే కేవలం 6 రూపాయలు మాత్రమే ఇస్తుందని వాపోయారు.

స్విగ్గీ థర్డ్ పార్టీకి ఎక్కువ కమీషన్ ఇస్తూ తమ పొట్టకొడుతుందని.. దూరం పెరగడంతో పాటు రోజుకు కనీసం 200 కూడా సంపాదించుకోలేకపోతున్నామని అన్నారు. దీంతో స్విగ్గీ సంస్థపై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. ఇక రెండు రోజుల్లో సమస్యలు పరిష్కారం కాకంటే హైదరాబాద్ మొత్తం ఆందోళనలు నిర్వహిస్తామని డెలివరీ బాయ్స్ తేల్చి చెప్పారు. ఇక డెలివరీ బాయ్స్ చేస్తున్న ఆందోళన చూసి స్విగ్గి యాజమాన్యం మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు వచ్చి రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని చెప్పి పంపారు.

swiggi boys

మెగా అభిమానులకు శుభవార్త చెప్పిన రామ్ చరణ్..!

టిక్ టాక్ ప్రియులకు ఊరట.. యూట్యూబ్ షార్ట్స్ వచ్చేసింది..!

నేను చనిపోయాననుకున్నారు.. బిగ్ బాస్ కంటెస్టెంట్..!