స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన భారీ ప్రతిష్టాత్మక సినిమా ‘సైరా’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ కి ప్రధాన హీరోయిన్ గా నయనతార నటించింది. తాజాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల ప్రీ బిజినెస్ చేసిందట. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ సంస్థ అన్ని భాషలలో కలిసి 40 కోట్లకు కొనుగోలు చేసింది. ‘సైరా’ డిజిటల్ రైట్స్ ఈ రేంజ్ లో అమ్ముడుపోవడంతో ఓ రికార్డు గా చెప్పవచ్చు.

ఇక ఈ సినిమా భారీ స్థాయిలో బిజినెస్ చేయడంతో విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్ సాధించింది. ఇక ఈ సినిమాలో అమితాబ్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, తమన్నా కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. కాగా ఈ సినిమా ట్రైలర్ ను ఈ నెల 15 న విడుదల చెయ్యబోతున్నారు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ సినిమాను కొణిదల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. ఇక అక్టోబర్ 2న తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడం భాషలలో ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున ఈ సినిమా విడుదల కానుంది.

  •  
  •  
  •  
  •  
  •  
  •