చిరంజీవి హీరోగా వస్తున్న “సైరా నరసింహారెడ్డి” సినిమాకు సంబంధించి ఆగష్టు 22 వ తారీఖున టీజర్ విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. అందులో భాగంగా ఈరోజు “సైరా నరసింహారెడ్డి” సినిమాకు సంబంధించి ప్రోమో విడుదల చేసారు. ముందు నుంచి చెబుతున్నట్లు టీజర్ లో పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఉంటుందని చెబుతున్నట్లే ప్రోమోలో పవన్ కళ్యాణ్ “సైరా నరసింహారెడ్డి” అనే సినిమా పేరు గట్టిగా పలగడంతో పవన్ అభిమానులు టీజర్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ఇక తాను సినిమాలు చేయనని రాజకీయాలకే తాను అంకితమని చెబుతుంటే అభిమానులు బాధపడిపోతున్నారు. అలాంటి డై హర్డ్ అభిమానుల కోసం పవన్ కళ్యాణ్ అందించిన వాయిస్ ఓవర్ తో టీజర్ రావడంతో రికార్డ్స్ పై కన్నేశారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకు సంబంధించి ఇప్పటి నుంచే ట్విట్టర్ లో ట్రెండీ చేస్తున్న అభిమానులు దానిని ఒక నాలుగు రోజులు పక్కన పెట్టి టీజర్ ను టార్గెట్ చేయడానికి ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు యూట్యూబ్ లో వ్యవహారమంతా మిలియన్స్ వ్యూస్ నీకు ఎన్ని అంటే… నీకు ఎన్ని అన్నట్లు ఉంది. చూద్దాం ఎన్ని రికార్డ్స్ బద్దలు కొట్టి టాప్ ట్రేండింగ్ లిస్ట్ లో నిలబడుతుంది.

ఈ సినిమాను చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ “కొణిదెల ప్రొడక్షన్స్”పై నిర్మించారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన అనుష్క, తమన్నా నటిస్తున్నారు. జగపతిబాబు, అమితాబచ్చన్, విజయ్ సేతుపతి ఇలా బారి తారాగణం నటిస్తున్న “సైరా నరసింహారెడ్డి” సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందు రానుంది. దాదాపుగా 200 కోట్ల పైగా ఖర్చు చేసి నిర్మించిన ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మళయాళంతో పాటు హిందీలో కూడా విడుదల చేయనున్నారు. ఇక టీజర్ రిలీజ్ తరువాత సినిమాపై అంచనాలు మరింత పెరుగుతాయని చిత్ర యూనిట్ భావిస్తుంది.

  •  
  •  
  •  
  •  
  •  
  •