స్వాతంత్ర సమరవీరుడు ‘ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి’ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘సైరా’. మెగాస్టార్ చిరంజీవి సరసన నయనతార ప్రధాన హీరోయిన్ గా నటిస్తుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను రామ్ చరణ్ నిర్మించాడు. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో సైరా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు చిత్ర యూనిట్. కాగా తాజాగా ఈ సినిమా వీడియో సాంగ్ ను విడుదల చేశారు. ‘పవిత్ర ధాత్రి భారతాంబ ముద్దు బిడ్డ అవురా’ అనే వీడియో సాంగ్ ను విడుదల చేశారు. ఈ సాంగ్ ప్రేక్షకులను, అభిమానులను ఎంత గానో ఉర్రుతలూగిస్తుంది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా భారీ ఎత్తున విడుదల కానుంది.