చిరంజీవి హీరోగా అక్టోబర్ 2వ తేదీ విడుదలకు సిద్ధమవుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ ట్రైలర్ ఈరోజు సాయంత్రం విడుదల చేశారు. ఈ ట్రైలర్ మొత్తం ఉగ్రనరసింహారెడ్డి ఉగ్ర రూపాన్ని దర్శకుడు కళ్ళకు కట్టినట్లు చూపించాడు. ట్రైలర్ మొత్తం జనసందోహంతో ఖర్చు భారీగా పెట్టినట్లు కనపడుతుంది. దేశం కోసం పోరాడే యోధుడిగా… దేశం కోసం బ్రిటిష్ వారిని తరిమికొట్టే మొట్టమొదటి యుద్ధబేరి ఉగ్రనరసింహారెడ్డి మోగిస్తూన్న ట్రైలర్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయనడంలో సందేహమే లేదు.