కరోనా వైరస్ తీవ్రంగా విస్తరిస్తున్న నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ వాయిదా పడింది. ఈ ఏడాది అక్టోబర్ లో ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ జరగాల్సి ఉంది. కరోనా ముప్పుతో ప్రపంచకప్ ను నిర్వహించడం కష్టమని భావించిన ఐసీసీ.. వచ్చే ఏడాదికి వాయిదా వేసింది. వచ్చే ఏడాది అక్టోబర్‌-నవంబర్‌లో టీ20 వరల్డ్‌కప్‌ నిర్వహిస్తామని ఐసీసీ వెల్లడించింది.

ఇక ఐసిసి తీసుకున్న టీ 20 ప్రపంచ కప్ రద్దు నిర్ణయం తరువాత, IPL నిర్వహించే అవకాశాలు పెరిగాయి. తాజా సమాచారం ప్రకారం బిసిసిఐ సెప్టెంబర్ 26 నుండి నవంబర్ 8 వరకు ఐపిఎల్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. టీ 20 ప్రపంచ కప్ రద్దుతో ఐపిఎల్‌ను నిర్వహించడానికి బిసిసిఐ యోచిస్తోంది.

ఏపీ కరోనా తాజా బులెటిన్.. భారీగా పాజిటివ్ కేసులు, మరణాలు..!

తెలంగాణ సీఎంను కలిసిన యంగ్ హీరో నితిన్..!