గత కొద్ది రోజులుగా తెలుగులో బడా హీరోలతో సినిమాలు చేసిన తాప్సి డ్రగ్స్ కేసుతో పాటు సుశాంత్ కేసులో అడ్డంగా ఇరుక్కుపోయి ఉన్న రియా చక్రవర్తికి సపోర్ట్ చేస్తూ అనేక ట్వీట్స్ చేసింది. రియా చక్రవర్తిని అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని, ఆమెకు దీనితో ఎలాంటి సంబంధం ఉండి ఉండకపోవచ్చని ఇలా అనేక వ్యాఖ్యలు చేయడంతో నెటిజన్స్ ఆమెను టార్గెట్ గా అనేక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు హఠాత్తుగా తాప్సి తూచ్ తనకు రియాతో ఎలాంటి సన్నిహిత సంబంధాలు లేవని తాను ఒక మహిళకు జరుగుతున్న అన్యాయం పై మాత్రమే స్పందించానని, తాను రియాను ఎప్పుడు కలవలేదని, తనకు రియాకు అసలు సంబంధమే లేదని చెప్పుకొస్తుంది.

ఇలా తాప్సి మాట్లాడటం చూస్తుంటే రియా చక్రవర్తి డ్రగ్స్ వ్యవహారం గురించి అందరి బాగోతాలు బయటపెట్టడంతో ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్ ఇరుక్కున్నారని అరోపణలు రావడంతో పాటు మరొక 25 మంది ప్రముఖులు ఆ లిస్ట్ లో ఉన్నారని కథనాలు రావడంతో తాను ఎక్కడ ఈ కేసులో ఇరుక్కుంటానో అని బయపడుతుందా అనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సుశాంత్ మరణంతో తరువాత రియా చక్రవర్తిపై అనేక ఆరోపణలు రావడంతో పాటు ఆమె చేసిన అనేక తప్పులు ఎత్తిచూపేలా మీడియాలో అనేక కథనాలు వచ్చినా వాటిని నమ్మకుండా తాప్సి ఒక్క రియా చక్రవర్తి వైపే మాట్లాడం చూస్తుంటే రియా చక్రవర్తితో ఈవిడగారికి బాగానే లింకులు ఉన్నాయని అనిపిస్తుంది.దీనిపై త్వరలో పోలీసులు మొత్తం వ్యవహారం తేల్చే పనిలో ఉన్నారు.