తెలుగు ఇండస్ట్రీ క్వీన్ గా కొన్నేళ్ల పాటు వెలిగిన తమన్నా ఇప్పుడు బాలీవుడ్ కు చెక్కేసి అక్కడ సినిమా ప్రయత్నాలలో ఉంది. ఇప్పటికే ఒకటి రెండు సినిమాలు చేస్తూ బిజీ బిజీగానే గడుపుతుంది. ఇక టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వెళ్లిన తమన్నా ముంబైలో సెటిల్ అవ్వాలని… ముంబైలో స్థిరనివాసం ఏర్పరుచుకోవాలని నిర్ణయించుకొని ఒక ఫ్లాట్ కొనుగోలు చేసిందట.

ముంబై మహానగరంలో తనకు నచ్చిన ప్రదేశంలో నచ్చిన ఫ్లాట్ కోసం ఉన్న రేటు కంటే డబుల్ రేటు పెట్టి కొనుగోలు చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై స్పందించిన తమన్నా తాను బయట చెప్పుకుంటున్నట్లు డబుల్ అమౌంట్ పెట్టి కొనలేదని, అలా కొనవలసిన అవసరం కూడా తనకు లేదని అంటుంది. బాలీవుడ్ కు వెళ్లినా తెలుగులో కూడా అడపా దడపా సినిమాలు చేస్తూ అప్పుడప్పుడు తెలుగు ఇండస్ట్రీని పలకరిస్తుంది. యాంకర్ ఓంకార్ దర్శకత్వంలో నిర్మించనున్న “రాజుగారి గది 3” సినిమాలో మొదటగా తమన్నా ఎంపికైనా తరువాత ఎందుకనో ఆమె ఆఫర్ ను వదులుకుందట. 
  •  
  •  
  •  
  •  
  •  
  •