ఆర్టికల్ 370పై భారత్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పాకిస్తాన్ ఇప్పటికే రెండు ట్రైన్స్ నిలిపివేయగా… ఇండియా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులను కూడా గత వారం రోజులుగా నిలిపివేసింది. భారత్ తో వాణిజ్య బంధానికి స్వస్తి చెప్పాలని పాకిస్థాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అక్కడి ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. 

భారత్ నుంచి తక్కైవ రేటుకు కొనుగోలు చేసే టమోటా ధర… ఈ వాణిజ్య దిగుమతులకు స్వస్తి చెప్పడంతో కేజీ 300 రూపాయలకు ఎగపాకింది. టమోటా కేజీ 300 వందలు పలుకుతుంది అంటేనే భారత్ తో బంధం తెంచుకోవడంతో అక్కడ ప్రజల పరిస్థితి ఎలా ఉందో అర్ధమవుతుంది. ఇక రానున్న రోజులలో మరిన్ని వస్తువల రేట్లు పెరగనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్ కు సంబంధించిన భూభాగం విషయంలో పాకిస్థాన్ లొల్లి షురూ చేయడంతో ఇండియా కూడా వెనక్కు తగ్గకుండా మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తుంది. కోపాలకు పోతే పాకిస్థాన్ కే ఇబ్బంది తప్ప ఇండియాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అంటున్నారు. ఇక నిత్యావసర రేట్లు పెరుగుతుండటంతో పాకిస్థాన్ ఏమైనా దిగి వస్తుందేమో చూడాలి.