కరోనా వైరస్ దెబ్బకు దాదాపుగా ఆరు నెలల నుంచి ఎవరు ఇంట్లో నుంచి బయటకు రాకుండా బిక్కు బిక్కుమంటూ గడిపారు. ఇంకా కరోనా వైరస్ తగ్గకపోయినా వైరస్ లో గతంలో ఉన్నంత పట్టు లేకపోవడంతో పాటు వైరస్ వచ్చిన తరువాత వెంటనే ఒక నాలుగైదు రోజులకు తగ్గిపోతుందని ప్రస్తుతం వస్తున్న కేసులు చూడటంతో ప్రజలంతా తమ కార్యకలాపాలు మునుపటిలా మొదలుపెట్టేశారు. కొంతమంది అయితే ఏకంగా మాస్క్ లు లేకుండా ఎంచక్కా బయట తిరిగేస్తూ తమను కరోనా టచ్ చేయదన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఒక్కరోజు ఇంటి పట్టున ఉండటానికి ఇష్టపడని హీరో, హీరోయిన్స్ ఇన్ని నెలలు తరువాత ఒకొక్కరు టూరిస్ట్ స్పాట్స్ కు వెళుతూ ఫుల్ గా ఎంజాయ్ చేసేస్తున్నారు. సెలెబ్రేటిస్ ఎంజాయ్ చేయడానికి ఎక్కువగా మాల్డీవులు లాంటి టూరిస్ట్ స్పాట్స్ కు వెళుతుంటారు. ఇప్పుడు తాప్సి కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మాల్డీవులు చెక్కేసి అక్కడ ఏమాత్రం లేట్ చేయకుండా ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టేస్తుంది. ఒకవైపు స్విమ్మింగ్ చేస్తుంటే స్నాక్స్ తింటున్న ఫోటో తాప్సి ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టడంతో ఫుల్ వైరల్ గా మారిపోయింది. ఇలా అందరూ ఏదో ఒక టూరిస్ట్ స్పాట్ కు వెళుతూ బయట గాలిని పీల్చుకుంటూ బికినిలో ఎంజాయ్ చేస్తూ తమ ఒంపు సొంపులను కెమెరాలో బంధిచేసి అభిమానులను గిలిగింతలు పెడుతున్నారు.