భారతదేశానికి చెందిన ఎంతో మంది విదేశాలలో చదవుకుంటుంటారు. వారి ఖర్చు నిమ్మితం భారత్ నుంచి వారి కుటుంబాలు డబ్బులను పంపించడం జరుగుతుంటుంది. కానీ గత ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో సవరణల దృష్ట్యా ఎవరైనా చదవుకుంటున్న వారి కోసం లేదా టూర్ ప్యాకేజీ కింద విదేశీ పర్యటన చేసినా ఆదాయపు పన్ను చెల్లించాలసిందే. ఈ ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 20Cని సవరించడంతో ఇక నుంచి డబ్బులు పంపించేవారు 5 శాతం పన్ను చెల్లించక తప్పదు.

ఇదేమి కొత్తగా విధిస్తున్న పన్ను కాదని, హవాలా లావాదేవీలు అడ్డుకోవడానికి చేస్తున్న ప్రయత్నమని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ తెలియచేసారు. హవాలా మార్గంలో అక్రమంగా వేల కోట్ల రూపాయలు విదేశాలకు తరలిపోతుండటంతో ఇప్పుడు పన్ను విధిస్తున్నట్లు తెలుస్తుంది. కానీ విదేశాలలో చదవుల కోసం వెళ్లే వారి కుటుంబాలకు వారి అవసరాల కోసం డబ్బును పంపించాలంటే ఇది భారంగా మారే అవకాశం ఉంది.

  •  
  •  
  •  
  •  
  •  
  •