ప్రభాస్ హీరోగా రాబోతున్న “సాహో” సినిమాపై ఇప్పటికే బారి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించి నిన్న ఆడియో ఫంక్షన్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అతిరధ మహారధులు రావడమే కాకుండా సినిమాను ప్రశంసలతో ముంచెత్తారు. కానీ ఇంత మంది పొగడ్తలతో ముంచెత్తుతున్నా జనసేన, తెలుగుదేశం శ్రేణులు మాత్రం ఈ సినిమాకు నెగటివ్ ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు.

ప్రభాస్ తన సినిమాలో భాగంగా ఒక మీడియా ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ జగన్ ప్రభుత్వంపై ప్రభాస్ చేసిన పాజిటివ్ కామెంట్స్ ఇప్పుడు జనసేన పార్టీతో పాటు, తెలుగుదేశం శ్రేణులకు ఆగ్రహం తెప్పించింది. ప్రభాస్ సినిమాపై ప్రచారం చేస్తూ రాజమౌళితో సినిమా చేసిన తరువాత ఏ హీరో సినిమా హిట్ అయిన దాఖలాలు లేవని, అలాగే ప్రభాస్ “సాహో” సినిమా కూడా ప్లాప్ అవుతుందని అంటున్నారు.

ఇక జనసేన పార్టీ కార్యకర్తలు కూడా త్వరలో చిరంజీవి హీరోగా వస్తున్న “సైరా నరసింహారెడ్డి” సినిమాను దృష్టిలో పెట్టుకొని మరింత ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఈ రెండు సినిమాలు వందల కోట్ల రూపాయలతో నిర్మించడంతో “సాహో” సినిమాకు మొదటి రోజు బారి కలెక్షన్స్ వస్తే “సైరా నరసింహారెడ్డి” సినిమాకు ఇబ్బందిగా మారుతుందని వ్యతిరేక ప్రచారాన్ని మొదలుపెట్టారు. గోదావరి జిల్లాలో మొదటి నుంచి మెగా అభిమానులకు… ప్రభాస్ అభిమానులకు మధ్య వార్ నడుస్తుంది అన్న సంగతి తెలిసిందే.

ఇక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రం ప్రభాస్… జగన్ ను పొగడటంతో జీర్ణించుకోలేక పోతున్నారు. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన ఎవరని పచ్చ కార్యకర్తలు వదిలిపెట్టరు. అది ఎన్టీఆర్… కళ్యాణ్ రామ్ ఇంకా ఎవరైనా సరే. తెలుగుదేశం పార్టీతో విబేధాలు వచ్చినప్పుడు ఎన్టీఆర్ సినిమాలు బాగున్నా… నెగటివ్ టాక్ పుట్టించి సినిమా కలెక్షన్స్ తగ్గించడానికి శతవిధాలా ప్రయత్నించేవారు. విజయవాడ లాంటి ప్రాంతాలలో థియేటర్స్ దొరకకుండా చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి.

ఒక విలేకరి అడిగిన ప్రశ్నలో భాగంగా ప్రభాస్ మాట్లాడిన మాటలను పట్టుకొని ఇలా నిందలు వేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ జగన్ పాలన బాలేదని ప్రభాస్ అంటే… చంద్రబాబు ఏమైనా వెంటనే అధికారంలోకి వచ్చేస్తున్నాడా లేదు కదా… మూడు నెలలు కూడా నిండకుండానే జగన్ ప్రబుత్వంపై తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు చేస్తున్న ప్రచారం ఎంత దారుణంగా ఉందో ప్రభాస్ ఉదంతమే నిదర్శనం.

  •  
  •  
  •  
  •  
  •  
  •