టీడీపీ పునరావాస కేంద్రాలను పోలీసులు ఖాళీ చేయించారు. వారిని దగ్గరుండి పోలీసులే వారి ఊర్లకు పంపించి వేశారు. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు. ఇక్కడికి రావడానికి గల కారణాలు ఏమిటి. గ్రామంలో పరిస్థితి ఏమిటి. గ్రామంలో ఏమైనా సమస్యలు తలెత్తాయా అని భాదితులను ప్రశ్నలు అడిగి పోలీసులు వారిని వారి ఊర్లకు పంపి వేశారు. ఇదే సమయంలో వైసీపీ సైతం టీడీపీ బాధితులను గుంటూరు తీసుకొచ్చింది. వారు కూడా చలో ఆత్మకూరు అని పిలుపునిచ్చారు. దీంతో రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

ఆత్మకూరులో రెండు కుటుంబాల మధ్య గొడవ మాత్రమేనని.. కానీ టీడీపీ నేతలు దీనిని రాజకీయ గొడవగా చిత్రీకరిస్తున్నారని.. గుంటూరు వచ్చిన భాదితులు చెబుతున్నారు. అసలు ఆయా ఊరుల్లో కొన్ని రోజులు పోలీసులు మకాం పెడితే సమస్య తీరిపోతుందంటున్నారు. అసలు అక్కడ సమస్యే లేదని.. కావాలనే చంద్రబాబు నాయుడు రాజకీయ ఎత్తుగడ వేశాడని అక్కడ ప్రజలు అన్నట్లు సమాచారం. ఇక పునరావాస కేంద్రాలలోని వారు పెయిడ్ ఆర్టిస్టులని వారిని డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారని ప్రచారం జరుగుతుంది.

  •  
  •  
  •  
  •  
  •  
  •