దెందులూరు మాజీ టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని పోలీసులు ఎట్టికేలకు అరెస్ట్ చేశారు. అనుచరులతో సహా బుధవారం దుగ్గిరాలలోని తన నివాసానికి వచ్చిన ఆయనను పోలీసులు కాసేపటికే అరెస్ట్ చేశారు. గత కొంత కాలం నుండి చింతమనేని అజ్ఞాతంలో ఉన్న సంగతి తెలిసిందే. అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను చూడటానికి చింతమనేని ప్రభాకర్ తన ఇంటికి వచ్చానని చెబుతున్నారు. కాగా ప్రభాకర్ పై పోలీసులు 10 కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

పినకడిమి గ్రామానికి చెందిన దళిత యువకులపై దాడి ఘటనలో ప్రభాకర్ పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. అంతే కాకుండా పలు అక్రమాలు, దౌజన్యాలకు సంబందించి మొత్తం 10 కేసులు నమోదు అయ్యాయి. పోలీసులు అరెస్ట్ చేస్తారన్న సమాచారంతో ఆయన అప్పటి నుండి అజ్ఞాతంలోకి వెళ్లారు. అప్పటి నుండి గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు చింతమనేని ప్రభాకర్ ని అరెస్ట్ చేశారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •