చీరాల నియోజకవర్గం నుంచి గత 2014 ఎన్నికలలో ఇండిపెండెంట్ గ ఆపాటి చేసి దాదాపుగా 15 వేల ఓట్ల పైచిలుకతో విజయం సాధించిన ఆమంచి కృష్ణ మోహన్ ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీలో చేరి ఇప్పుడు 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ పార్టీలోకి జంప్ కొట్టి చీరాల నుంచి మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడనున్నారు. ఇక ఆమంచి కృష్ణ మోహన్ ను ఓడించడానికి మొదటిగా చంద్రబాబు నాయుడు సీనియర్ నాయకుడు కరణం బలరాంను నిలబెట్టాలని తలచారు. కానీ కరణం బలరాంను అక్కడ నుంచి నిలబడటంతో గెలుపోటముల సంగతి పక్కన పెడితే కొత్త చిక్కులు వచ్చేలా ఉన్నాయి. అందుకని ఇప్పుడు చీరాల నుంచి కరణం బలరాంను తప్పించి గత ఎన్నికలలో టీడీపీ తరుపున బాపట్ల ఎంపీగా గెలిచిన శ్రీరామ్ మాల్యాద్రిని నిలబెట్టాలను బాబు ఆలోచిస్తున్నారు.

ఇప్పటికే బాపట్ల పార్లమెంట్ ఎంపీ కావడంతో పాటు, చీరాల నియోజకవర్గం కూడా బాపట్ల పార్లమెంట్ లో భాగం కావడంతో, కొంత మేర ఉన్న పరిచయాలతో మాల్యాద్రి అయితేనే ఆమంచిని డీ కొట్టగలడని చంద్రబాబు భావిస్తున్నాడు. కానీ మాల్యాద్రి మాత్రం మరలా వచ్చే ఎన్నికలలో బాపట్ల ఎంపీ స్థానానికి పోటీ చేయడానికి మక్కువ చూపిస్తున్నట్లు తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు మాత్రం మాల్యాద్రిని ఒప్పించడానికి రాజకీయాలలో మాల్యాద్రి గాడ్ ఫాదర్ అయిన సుజనా చౌదరిని రంగంలోకి దింపి మాల్యాద్రిని ఒప్పించే పని అప్పగించారు. చంద్రబాబు నాయుడు తలచినట్లు మాల్యాద్రి వచ్చే ఎన్నికలలో చీరాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆమంచికి ఎలాంటి పోటీ ఇవ్వబోతున్నాడనేది కొంత ఆసక్తి దాయకంగా మారింది.