తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన దగ్గర నుంచి ఏదో ఒక లొల్లి కొనసాగుతూనే ఉంది. ఇక ప్రభుత్వం ఓడిపోయిన దగ్గర నుంచి పార్టీకి అండగా నిలబడుతూ అసెంబ్లీలో తన వాయిస్ గట్టిగా వినిపిస్తున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈరోజు తన తెలుగుదేశం పార్టీ ఉపనేత పదవికి రాజినామా చేసి ఇక నుంచి తాను ఎన్నికలలో పోటీ చేయనని స్పష్టం చేసారు.

ఇప్పటికే బోండా ఉమ లాంటి కాపు నేతలంతా లొల్లితో చంద్రబాబు నాయుడు ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు ఈ గోరంట్ల గొడవ ఏమిటో తెలియక టీడీపీ నేతలు జుట్టు పీకుంటున్నారు. గోరంట్ల బుచ్చయ్య మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో వైట్ ఎలిఫేంట్స్ ను పక్కన పెట్టాలని, తాను రాజీనామా చేసిన పదవిని బీసీలకు ఇవ్వాలని కోరారు. తెలుగుదేశం పార్టీ అదిఆకారాన్ని కోల్పోయిన తరువాత చాల యాక్టీవ్ గా ఉంటు… ప్రతిపక్ష పార్టీకి దక్కే ఒకే ఒక్క క్యాబినెట్ ర్యాంక్ ఉండే “పీఏసీ” చైర్మన్ పదవి కోసం ఆశ పడ్డారు. కానీ పయ్యావుల కేశవ్ పార్టీ మారతాడని… వైసీపీ పెద్దలతో టచ్ లో ఉన్నాడని భావించి చంద్రబాబు నాయుడు పీఏసీ పదవి పయ్యావులకు కట్టబెట్టారు. కానీ తనకు వస్తుందనుకున్న పీఏసీ పదవి పయ్యావుల తన్నుకుపోయాడన్న అలకనో… లేక మరేదైనా విషయంలో అలిగారో గాని గోరంట్ల అలకతో మరోసారి రాయబారులను పంపించి బుజ్జగించే పని షురూ చేయాల్సిందే.

  •  
  •  
  •  
  •  
  •  
  •