వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత… జగన్ ప్రభుత్వం గత ప్రభుత్వంలో జరిగిన పనులలో 20 శాతం కన్నా తక్కువ ఎక్కడైతే జరిగాయో వాటన్నింటిని రద్దు చేయమని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. వాటితో పాటు గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న బిల్లులు జగన్ ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారట.

దాదాపుగా పదుల కోట్ల నుంచి వందల కోట్ల వరకు బిల్లులు పెండింగ్ లో ఉండటంతో వాటిని ప్రభుత్వం ఇప్పటికిప్పుడు క్లియర్ చేయడానికి సిద్ధంగా లేదు. గత ప్రభుత్వం ఇష్టమొచ్చిన రీతిలో కాంట్రాక్టు రేట్లు పెంచేసి దారుణంగా ప్రభుత్వ ధనానికి గండికొట్టారని జగన్ ప్రభుత్వం భావిస్తుంది. ఇక చేసేదేమిలేక టీడీపీ నేతలు ఒక మెట్టు దిగి వచ్చి వైసీపీ నేతలతో మంతనాలు షురూ చేశారట. 

దయచేసి మా బిల్లులు ఎలాగైనా క్లియర్ చేయించాలని, ఇంకొంత మంది సీనియర్ నేతలైతే తమ కన్నా తక్కువ వయస్సు ఉన్నా నాయకుల దగ్గర అహం వదిలి ఒకరకంగా దేహి అని కాళ్ళ… వెళ్ళా పడే స్థాయికి కూడా దిగజారుతున్నారట. కానీ వైసీపీ నేతలు వారి బాధను అర్ధం చేసుకొని ఏదైనా సహాయం చేసిపెట్టాలని ఉన్నా… సీఎం వైఎస్ జగన్ మాత్రం పారదర్శకంగా ఎవరైతే పనులు సరిగ్గా చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా వ్యవహరించారో అలాంటి వారికి క్లియర్ చేస్తాం తప్ప… తప్పుడు పనులతో కాంట్రాక్ట్స్ సంపాదించి అడ్డగోలుగా వ్యవహరించిన వారి పట్ల మొత్తం లెక్కలు తేలేవరకు కఠినంగా వ్యవహరిస్తానని చెప్పడంతో వైసీపీ నాయకులు కూడా మిన్నకుండి పోయారు.  

 


Tags: Ys jagan


  •  
  •  
  •  
  •  
  •  
  •