ఈ రోజు ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుండి సస్పెండ్ అయ్యారు. సభ కార్యక్రమాలకు పదే పదే అడ్డుతగులుతున్నారని.. శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కోరారు. కావున వారిని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య తన ఆవేదనను వ్యక్తం చేశారు.

తాను ఆరు సార్లు ఎమ్మెల్యే అయ్యానని… వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్నపుడు కూడా ఉన్నానని.. ఆయన చెయ్యలేని పని జగన్ చేయించారని అన్నారు. తాము ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయించలేదని అడిగితే సీఎం సమాధానం చెప్పలేక తనను అన్యాయంగా సభ నుండి సస్పెండ్ చేశారన్నారు బుచ్చయ్య చౌదరి.
  •  
  •  
  •  
  •  
  •  
  •